Tuesday, March 10, 2026

యువత సైబర్ మోసాల బారిన పడవద్దు

హసన్ పర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. చేరాలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

యువత సైబర్ మోసాల బారిన పడవద్దని హసన్ పర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. చేరాలు అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళాబృందం వారు హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధి లోని మహాత్మ జ్యోతిరావు పూలే (బాలికల) జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐ చేరాలు మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్, గుట్కా, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు దూరంగా ఉండాలని చదువుపై శ్రద్ధ పెట్టాలని రోడ్డు ప్రమాదాలు డయల్ 100 షీ టీమ్స్ ఈవ్ టీజింగ్ హ్యూమన్ ట్రాఫిక్ ఇన్ గురించి వివరించారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని సైబర్ మోసాలకు గురైతే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి ఫోన్ చేయాలని పలు అంశాలపై పోలీస్ జాగృతి కళాబృందం ఆలపించిన పాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసాయి విద్యార్థులతో గంజాయి మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హసన్ పర్తి ఏఎస్ఐ కళాశాల ప్రిన్సిపల్ గ్రూపుల దేవి బ్లూ కోర్ట్ కానిస్టేబుల్స్ కళాబృందం ఇన్చార్జ్ ఏఎస్ఐ నాగమణి హెడ్ కానిస్టేబుల్ విలియం వెంకటేశ్వర్లు రత్నయ్య కానిస్టేబుల్ ఫుల్ సింగ్ హోంగార్డు శ్రీనివాస్, విక్రమ్, రాజు, చిరంజీవి, కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News