నేటి సాక్షీ చెన్నూరు టౌన్:జైపూర్ మండలం యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో ప్రకటించిన పథకానికి మంచి స్పందన లభిస్తోందాని చెన్నూర్ అసెంబ్లీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇలియాజుద్దీన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే కొంతమంది యువ అభ్యర్థుల నామినేషన్ డిపాజిట్ రుసుములను స్వయంగా చెల్లించారు మండలం వ్యాప్తంగా సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్‌గా పోటీ చేయాలనుకున్న 18–35 సంవత్సరాల మధ్య ఉన్న SC/ST/BC జనరల్ యువ అభ్యర్థులు ముందుకు రావడంతో వారి ఆర్థిక భారాన్ని తగ్గించి రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహకంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ చర్య చేపట్టారు ఇలియాజుద్దీన్ ఇప్పటికే కొన్ని గ్రామాల యువ అభ్యర్థులకు సర్పంచ్ పోస్టుకు ₹1,000 / ₹2,000, వార్డ్ మెంబర్ పోస్టుకు ₹250 / ₹500 నామినేషన్ ఫీజులను వ్యక్తిగతంగా చెల్లించారు యువతకు సర్పంచ్‌గా గెలవడం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష సేవ చేసే పెద్ద అవకాశం మాత్రమే కాదు ప్రభుత్వం అందించే నెల జీతం ₹7,500 కూడా లభిస్తుంది అని ఆయన ప్రత్యేకంగా తెలియజేశారు దీంతో గ్రామ స్థాయిలో నాయకత్వం వహించాలని అనుకునే యువతలో మరింత ఆసక్తి పెరుగుతోంది జైపూర్ మండలం అభివృద్ధికి యువ శక్తి అత్యవసరం నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. నామినేషన్ రుసుము కారణంగా యువత వెనుకకు తగ్గకూడదు. ఇప్పటివరకూ కొందరి ఫీజులు చెల్లించాను ఇంకా వచ్చే యువతను కూడా నేను పూర్తిగా ప్రోత్సహిస్తాను” అని మొహమ్మద్ ఇలియాజుద్దీన్ తెలిపారు యువ అభ్యర్థుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు నామినేషన్ ఫీజులు వివరాల కోసం అభ్యర్థులు కింద పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చు: 99126 92863, 98484 61734, 89789 90517 అని పేర్కొన్నారు.





