నేటిసాక్షి, మిర్యాలగూడ : మండల పరిధిలోని అవంతిపురం, శ్రీనివాస్ నగర్, తుంగపహాడ్ లో ఉన్న ధాన్యం, యూరియా గోదాములను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తో కలిసి మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగుల చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ధాన్య/ఎరువుల నిల్వల వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎరువుల దుకాణాలల్లో ఉన్న స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి, యూరియా అందుబాటును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియాను ఎవ్వరైనా డీలర్లు పక్కదారి పట్టించి, రైతులను ఇబ్బదులకు గురి చేస్తే లైసెన్సులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ, యూరియా యాప్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, మరియు మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారులు సైదా నాయక్, తహశీల్దార్, రైతులు తదితర అధికారులు పాల్గొన్నారు.

