Thursday, March 19, 2026

*యూ..యూజ్ లెస్ ఫెలో.!*—* జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫైర్* కోరుట్ల ప్రజలు జగిత్యాల ఆసుపత్రికి వస్తే ఎందుకొచ్చారని అడుగుతారా.?* నడుంనొప్పి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేవారు.? అసలు కామన్ సెన్స్ ఉందా? అంటూ ఎమ్మెల్యే సంజయ్ ఘాటు వ్యాఖ్యలు—–*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల ప్రజలు చికిత్స కోసం జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ‘ఎందుకు వచ్చారు’.? అంటూ ప్రశ్నించడం పూర్తిగా అనవసరమని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సేవలు పొందడం కోరుట్ల ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు.*కామన్ సెన్స్ ఉందా.?*’కోరుట్ల ప్రజలు జగిత్యాల ఆసుపత్రికి వస్తే ఎందుకొచ్చారని అంటావా.? కామన్ సెన్స్ ఉందా నీకు.!’అంటూ తీవ్ర స్వరంతో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో నడుం నొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకైనా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు జిల్లా స్థాయి ఆసుపత్రి అందుబాటులో ఉండగా అక్కడికి వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అన్ని నియోజకవర్గాల ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి సహా జిల్లా ప్రజలందరికీ ఈ ఆసుపత్రి సమాన హక్కుతో సేవలు అందించాలన్నారు. వైద్య సిబ్బంది కూడా ప్రజల పట్ల మరింత సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రగడ జగిత్యాల జిల్లాలో చర్చానీయాంశమైంది._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News