Monday, December 23, 2024

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..

  • జీవితంలో యోగా ఒక భాగం
  • సర్వవ్యాధుల నివారణ సాధ్యం
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

నేటి సాక్షి, కరీంనగర్​: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ దీన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కరీంనగర్ జ్యోతినగర్​లోని మున్సిపల్ గ్రౌండ్​లో శుక్రవారం ఉదయం జరిగిన యోగా కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సర్వ వ్యాధుల నివారణకు యోగాన్ని పరిష్కార మార్గం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియా తో మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని పేర్కొన్నారు. 2014 లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఐక్య రాజ్య సమితిలో ప్రకటించిన తర్వాత దాదాపు 196 దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. శారీరక మానసి కొల్లాసానికి, అధ్యాత్మిక చింతనకు యోగా తప్పని సరని సమాజంలో అందరికీ అవగాహన వచ్చిందని తెలిపారు. ప్రతి రోజు అందరూ యోగా చేసిన తర్వాతనే బయటికి వెళ్లాలని సూచించారు. అన్ని అన్ని వ్యాధులకు పరిస్కారం యోగా, ఇది కేవలం ఆషామాషగా చెప్పడం లేదన్నారు. అనేక మంది దీని మీదా సర్వేలు చేసి స్పష్టం చేశారని వెల్లడించారు. చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా యోగా చేయడం చూస్తున్నామని పేర్కొన్నారు. మన శ్రేయస్సు తో పాటు సమాజ శ్రేయస్సు కోసం యోగా అనేది చక్కని పరిష్కార మార్గమని తెలిపారు. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో అందరు కూడా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు బాస సత్యనారాయణ రావు, బండ రమణారెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News