నేటి సాక్షి :జిన్నారం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం మున్సిపల్ పరిధిలోని శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో యోగ దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగ దినోత్సవం సందర్బంగా పలు యోగాసనాలు వేసారు. పాఠశాల కరెస్పాండంట్ కొత్వాల్ హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ జీవితంలో యోగా గురించి అవగాహన పెంచడానికి, యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి యోగ ఉపయోగం పడుతుందని తెలిపారు.యోగా అంటే మనస్సు, శరీరం మరియు ఆత్మను ఏకం చేయడం. ఇది ఒక పురాతన భారతీయ విభాగం,యోగా వశ్యత మరియు బలాన్ని పెంచుతుందని, ఇది ఏకాగ్రతను స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తుందని,రోజువారీ యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్నారు.
ఉపాధ్యాయులు సింహాచలం, పాఠశాల సిబ్బంది,విద్యార్థులతో పాటు స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు కెజెఆర్ ఆనంద్ కృష్ణ రెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి టీ. మేఘన రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు సరిత, ప్రధాన కార్యదర్శి అఖిల్, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.

