నేటి సాక్షి, నారాయణపేట, మార్చి 21 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లాలోని ఈద్గాలు, మసీదులు మరియు ప్రార్థన మందిరాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పోలీస్ అధికారులు, సిబ్బంది కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించరుజ్ఈ సందర్భంగా డిఎస్పీ ఎన్. లింగయ్య జిల్లా కేంద్రంలోని బువ్వమ్మ గుట్ట ఈద్గా వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా అవసరమైన సూచనలు సిబ్బందికి ఇచ్చారు.అనంతరం అక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు.





