Friday, March 13, 2026

రండి బాబూ రండి..**విద్యుత్ బకాయిలు చెల్లించండి..!*————–* వేములకుర్తి గ్రామంలో మైక్ పట్టుకుని లైన్మెన్ చాటింపు* విద్యుత్ బకాయిల వసూళ్లలో వినూత్న ప్రయత్నం* పనితీరుతో అధికారుల మెప్పు పొందిన కొలిపాక రాజు—

నేటి సాక్షి – ఇబ్రహీంపట్నం*( రాధారపు నర్సయ్య )విద్యుత్ శాఖలో సాధారణంగా బకాయిల వసూలు అంటే హెచ్చరికలు, నోటీసులు గుర్తొస్తాయి. కానీ, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో మాత్రం లైన్మెన్ మైక్ పట్టుకుని తిరుగుతూ చాటింపుతోనే బకాయిలు వసూలు చేసే వినూత్న మార్గం ఎంచుకున్నాడు. ఆయన కృషి ఇప్పుడు అధికారులకే ఆదర్శంగా మారింది.—*గ్రామంలో మైక్‌తో తిరిగిన లైన్మెన్ రాజు*ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్ కొలిపాక రాజు, ఆదివారం చిన్న మైక్ పట్టుకుని గ్రామంలోని వీధులన్నీ తిరిగాడు.“రండి బాబూ రండి..విద్యుత్ బకాయిలు చెల్లించండి..!” అంటూ ప్రజల్ని అప్రమత్తం చేశాడు.జిల్లా అధికారి సుదర్శనం, డివిజనల్ అధికారి మధుసూదన్ ఆదేశాల మేరకు, స్థానిక ఎఇ సతీష్ ఆధ్వర్యంలో విద్యుత్ బకాయిల క్యాంపు నిర్వహించారు.కొంతమంది చెల్లించకపోవడంతో, రాజు మైక్‌తో చాటింపు చేసి స్వయంగా వసూళ్లకు దిగాడు.—*వినూత్న పనితీరుతో ప్రశంసలు పొందిన రాజు*ఆదివారం రోజు సెలవు అని పక్కన పెట్టకుండా విధుల పట్ల అంకితభావంతో రాజు పనిచేయడం అందరినీ ఆకట్టుకుంది.సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా, లైన్ పనుల్లో కార్మికుడిగా కూడా విధులు నిర్వర్తిస్తూ — మూలరాంపూర్, బర్దిపూర్, వేములకుర్తి గ్రామాల ప్రజల మన్ననలు పొందుతున్నాడు.రైతులు, కంజూమర్‌లు ఆయనను “మా లైన్మెన్ రాజు గొప్పవాడు” అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.—*ఆదర్శంగా నిలిచిన విద్యుత్ సిబ్బంది*విద్యుత్ శాఖలో ఇలాంటి అంకితభావం ఉన్న సిబ్బంది చాలా అరుదు.లైన్మెన్ రాజు పనితీరు పై ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేశారు.బకాయిల వసూలుతో పాటు, ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాజు చేస్తున్న సేవా కార్యక్రమం ఇప్పుడు ఇతర మండలాల్లోనూ చర్చనీయాంశమైంది.__

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News