నేటిసాక్షి/ములుగు (ప్రతినిధి)ములుగు జిల్లా ప్రగల్లపల్లి గ్రామంలో మదర్ తెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంను భారత రాష్ట్ర సమితి ములుగు జిల్లా నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ప్రారంభించారు అనంతరం ఈ సందర్భంగా నాగ జ్యోతి మాట్లాడుతూ అమ్మ జన్మనిస్తుంది రక్తదానం పునర్జన్మనిస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రగల్లపల్లి గ్రామస్థులు ట్రస్ట్ సభ్యులు దాతలు నాయకులు పాల్గొన్నారు.





