Friday, March 20, 2026

రచ్చకెక్కిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వ్యవహారం..విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు.. తిరుపతి ఎంపీ గురుమూర్తి

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్‌మెంట్‌ ను తిరుపతి మహిళా పోలీసులు రికార్డు చేశారు. ఆ బాధితురాలి వద్ద కీలకమైన వివరాలను మహిళా పోలీసులు రాబట్టారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ పలు మార్లు లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డాను. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద మన ఇద్దరి వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్‌ బెదిరించాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడని వివరించింది. ఈ క్రమంలో లక్ష్మణ్‌కు కఠినమైన శిక్ష పడాలని ఆ బాధ్యత యువతి మహిళా పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి వెస్ట్‌ స్టేషన్‌ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశాలోని జార్హ్ పూర్‌లో వున్న బాధితురాలిని కలిశారు. ఆ యువతీని విచారించి వీడియో స్టేట్‌ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్ మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్‌లో ప్రస్తావన..______________________తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ నోటీసు ద్వారా వైయస్ఆర్‌సీపీ మద్దిల ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో మాట్లాడారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు..____________________విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ విద్యార్థినిపట్ల ప్రవర్తించిన తీరుపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వవిద్యాలయం ఇంచార్జ్ రిజిస్ట్రార్ రజినీకాంతుక్లా ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు 183/2025 కేసు నమోదైందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. దీనిపై విచారణకు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలంను దర్యాప్తు అధికారిగా, ఇద్దరు మహిళ ఎస్ఐలను సహాయ అధికారులుగా నియమించారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News