నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలకేంద్రంలో సత్యార్జున ఫంక్షన్ హాల్ లో భారత రాష్ట్ర సమితి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని,ఇంటిపై దాడి చేసి 3 రోజులు కావస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవటం లో అలసత్వం పాటిస్తున్నారని,వారిని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని,అభివృద్ధి చేయటం మరచి దాడులకు దిగటం సరి కాదని తెలిపారు.ఈ సమావేశంలో లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి,మాజీ ఏఏంసి మాజీ చైర్మన్ కచ్చు రాజయ్య,మాజీ సర్పంచ్లు చింతల పల్లి సంజీవ రెడ్డి, టేకు తిరుపతి, జెల్ల అయిలయ్య యాదవ్,మాజీ ఎంపీటిసి దుంబాల రాజా మహేంధర్ రెడ్డి,నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,రావుల రామకృష్ణ రెడ్డి,బోయినపల్లి శ్రీనివాస్ రావు,ముక్కిస తిరుపతి రెడ్డి,హన్మండ్ల లక్ష్మారెడ్డి,పాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్,దారం తిరుపతి రెడ్డి, కర్రావుల మల్లేశం,ఎర్రవెల్లి శ్రీనివాస్,ఎలుక దేవయ్య,గుబీరే మల్లేశం,బుర్ర శ్రీనివాస్ గౌడ్, బండారి రాములు,పట్టణ అధ్యక్షులు వంగల నరేష్,సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు,తాడిచెట్టు భూమయ్య, గుగ్గిళ్ళ శంకర్, తిప్పారపు మహేశ్, దొంతరవేణి ఓదెలు, చెరుకూరి నర్సయ్య, లోనే కిషన్ తదితరులు పాల్గొన్నారు.





