నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలం గుండారంలోని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫామ్ హౌస్ పై శుక్రవారం కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై రసమయి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఘటన జరిగింది. సుమారు 60 మందికి పైగా ఫామ్ హౌస్‌ను ముట్టడించగా, సమాచారం అందుకున్న ఎస్ఐ సౌజన్య, ఏసీపీ రవీందర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.అనంతరం రసమయి దిష్టి బొమ్మను దగ్దం చేశారు.పోలీస్ స్టేషన్ లో రసమయి బాలకిషన్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు.వీరిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




