Saturday, March 14, 2026

*రహదారిపై పేరుకుపైన మట్టి ప్రయాణికుల ఇబ్బందులు*

నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 27): రహదారిపై పేరుకుపోయిన మట్టితో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం సమీప రహదారిపై ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదలు రావడంతో రోడ్డుపై మట్టితో పాటు బురద, ఇసుక పేరుకుపోయింది. రోడ్డులో సగం మట్టితో నిండిపోవడంతో మిగతా సగంలోనే వాహనదారులు ప్రయాణాలు కొనసాగిస్తూ ఇబ్బంది పడుతున్నారు. మట్టి పేరుకపోయిన రోడ్డుపై వెళ్లే వాహనాలు అదుపు తప్పి కింద పడుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మారం-పెద్దపల్లి డబుల్ రోడ్డు అయినప్పటికి సింగిల్ రోడ్డుగా మారిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై పేరుకపోయిన మట్టిని తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహదారులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News