*నేటి సాక్షి – మల్లాపూర్*( మహేష్ పెంబి )కోరుట్ల నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల పరిస్థితిని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ స్వయంగా పరిశీలించారు. అయిలాపూర్ రోడ్, మల్లాపూర్ మండలం మొగిలిపేట రోడ్, ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్‌తో పాటు ఫకీర్ కొండాపూర్ బ్రిడ్జి పనుల స్థితిగతులను R&B అధికారులతో కలిసి వీక్షించారు. రెండు సంవత్సరాల క్రితం సాంక్షన్ అయిన రోడ్లు ఇంకా పూర్తి కాకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు.*బిల్లులు ఇవ్వక పనులు ఆపేశారు*కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో రహదారి పనులు నిలిచిపోయాయని సంజయ్ మండిపడ్డారు. ప్రతిరోజూ ఈ మార్గాలపై ప్రయాణించే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు పడుతున్న కష్టాలను వివరించారు. ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్ దుస్థితి గురించి మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. డబుల్ రోడ్‌తో పాటు డివైడర్ కూడా అవసరమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.*ఫకీర్ కొండాపూర్ బ్రిడ్జి వెంటనే ప్రారంభం*ఫకీర్ కొండాపూర్ బ్రిడ్జి దగ్గర పిల్లర్లు వేసి రెండు సంవత్సరాలుగా పనులు ఆగిపోయిన విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ప్రజలు అటు ఇటు వెళ్లలేని పరిస్థితి వస్తోందని, బిల్లులు ఇవ్వకుండా 8% కమిషన్ అడగడం మూలంగా పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. బ్రిడ్జి పనులు వెంటనే పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా నాణ్యమైన, స్థిరమైన రహదారులు వేయాలని R&B ఇంజినీర్లకు సూచించారు.___





