Tuesday, March 17, 2026

రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా కలిసికట్టుగా పోరాడుదాం.. కోరముట్ల శ్రీనివాసులు ఉదృతమవుతున్న హోరు.. మంగళవారం తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని కొరుముట్ల శ్రీనివాసులు పిలుపు..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 22~అన్నమయ్య జిల్లా :-: రాజంపేట జిల్లా కేంద్రం కోసం కలిసికట్టుగా ఎందాకైనా పోరాడుదామని రాజంపేట మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు అన్నారు.రైల్వే కోడూరుకు న్యాయం చెయ్యాలని రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం రాజంపేట మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు జేఏసీ సభ్యులకు సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొని రాజంపేట జిల్లా కోసం ఎందాకైనా పోరాడుదామని అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరముట్ల శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో తలపెట్టిన బంద్ కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని నామమాత్రంగా ర్యాలీలలో పాల్గొంటున్నారని వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో నేను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించగా అప్పట్లోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరియు అప్పటి ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ కు రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాలను కడపలోనే కొనసాగించాలని వీళ్లు కాకపోతే కోడూరు ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున ప్రజలతో కలిసొచ్చి వినతి పత్రాలు సమర్పించామని తక్షణమే ఐఏఎస్ ల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని పుంగనూరు, తంబలపల్లె, మదనపల్లె, రాయచోటి, రాజంపేట, కోడూరు ప్రాంతాలకు అనుగుణంగా భౌగోళికంగా సెంటర్ పాయింట్ గా ఉన్నందున రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటి, రాజంపేట, కోడూరు మూడు నియోజకవర్గాలుగా కలిపి అన్నమయ్య జిల్లాగా రాయచోటిని ప్రకటించడం మంచి పరిణామాలు కావని తక్షణమే రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాలకు న్యాయం న్యాయం చేకూర్చే విధంగా కోడూరు గత కొద్ది రోజులుగా వివిధ సంఘాలు, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అలాగే మంగళవారం తలపెట్టిన బంద్ లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని మరింత ఉధృతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి అవసరమైతే ఎటువంటి ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలకైనా సిద్ధంగా ఉండి కోడూరు నియోజకవర్గానికి న్యాయం జరిగే వరకూ అందరూ కలిసికట్టుగా ఉందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి & కోడూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవు శ్రీనివాసులు రెడ్డి, కోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ బాషా, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల, సర్పంచులు బుడిగీ శివయ్య, సుబ్రహ్మణ్యం రాజు, మైనార్టీ నాయకులు రఫీ, ముజీబ్, కరిముల్లా, ఇనమాల మహేష్,ఎంపీటీసీలు గని రాజా, పుష్పలత, జిల్లా యూత్ సెక్రెటరీ దమ్ము రఘు, సిద్దయ్య, రత్తయ్య, గునిశెట్టి రమేష్, డివి రమణ, కొప్పుల శంకరయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News