నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 21అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం లోని సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై శనివారం సత్య ప్రమాణాల జోరు కొనసాగింది ,రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బండపై గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి లక్ష్మీ నరసింహ స్వాములను దర్శించుకున్నారు, కొందరు ప్రమాణాలు చేయగా మరికొందరు వాయిదా వేసుకుని వెళ్లారు, చిత్తూరుకు చెందిన దంపతులు ఇంట్లో 13 గ్రాముల బంగారం చోరీ రావడంతో స్వామివారి వద్దకు వెళ్లి రావాల్సి ఉండగా శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తమ కాంపౌండ్ లో బంగారాన్ని వేసినట్లు తెలిపి అమ్మ స్వామి వారి చెంత పెట్టి పూజలు చేశారు అనంతరం సొత్తును వారికి అప్పగించారు ,ఆలయ అభివృద్ధికి సమాధి అడ్డంగా ఉందని టిటిడి అధికారులు తెలపడంతో పాపులమ్మ వారసులు సమాధిని తొలగించేందుకు ముందుకు వచ్చారు, సమాధి తీసిన తర్వాత టిటిడి అధికారులు అభివృద్ధి వేగవంతం చేయాలని వారు కోరారు,





