నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 21 సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండ ప్రసన్న ఆంజనేయస్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆలయంలోని హుండీ ద్వారా రూ 57,935లు ఆదాయంగా వచ్చినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ తెలిపారు, బుధవారం గత 4 నెలలకు గాను హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో భాగంగా నగదును భక్తులు స్వామి వార్లకు సమర్పించినట్లు ఆయన వివరించారు, ఈ కార్యక్రమంలో టిటిడి పరకామణి సిబ్బంది పాల్గొన్నారు

