నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ( కోక్కుల వంశీ )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. హరిత బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆమెను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సెక్రటరీగా నియమించింది.ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా ఉన్న గరిమా అగర్వాల్‌ను ప్రభుత్వం ఫుల్ అడిషనల్ ఛార్జ్ (FAC) కలెక్టర్‌గా నియమించింది. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఆమె జిల్లా కలెక్టర్‌గా కొనసాగనున్నారు.





