నేటి సాక్షి,నారాయణపేట,, నవంబర్ 10, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు అని యువకుడు మృతి చెందడం జరిగింది మృతి చెందిన కుటుంబానికి సూర్యచంద్ర ఫౌండేషన్ అధినేత పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అనంతరం కుటుంబానికి మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం కింద ₹20,000 నగదును ఆయన అందజేశారు మా నుండి మీ కుటుంబానికి ఎల్లవేళలా సాయ సహకారాలు ఉంటాయన్నారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరన్న, కాంగ్రెస్ పార్టీ మరికల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య, పోలేమోని రామకృష్ణ,రామకృష్ణారెడ్డి ,పెంట మీద రఘు, టైసన్ రాఘవేంద్ర, బోయ రఘు, ఏ చంద్రశేఖర్, పెంట మీద కురుమయ్య, మంగలి రఘు, బోయ వెంకటేష్, రఘుపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





