(నేటి సాక్షి) ప్రతినిధి. డిసెంబర్ 27: రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ నియోజకవర్గం శివరాంపల్లి గ్రామంజిహెచ్ఎంసి డివిజన్ ల విభజనలో శివరాంపల్లిని సులేమాన్ నగర్ డివిజన్ లో కలపడాన్ని వ్యతిరేకించిన గ్రామస్తులు ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు.శివరాంపల్లి గ్రామాన్ని సులేమాన్ నగర్ నుంచి తొలగించి రాజేంద్రనగర్ డివిజన్ లో కలపాలంటూ 300 లకు పైగా ఫిర్యాదులు రావడంతో అధికారులు శివరాంపల్లి గ్రామాన్ని సులేమాన్ నగర్ డివిజన్ నుంచి తొలగించి రాజేంద్రనగర్ డివిజన్ లోకి అధికారులు కలిపారు. శివరాంపల్లి ని రాజేంద్రనగర్ లో కలపడాన్ని స్వాగతించారు.శివరాంపల్లి గ్రామాన్ని రాజేంద్రనగర్ లో కలపడానికి సహకరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో షాగా ప్రతాపరెడ్డి రాగిశెట్టి యాదిరెడ్డి పెండ్యాల చంద్రమోహన్, పడమటి శ్రీధర్ రెడ్డి మాడురి ప్రభాకర్ రెడ్డి, బండారి శంకర్, దాసరి రమేష్, జీవన్ దాస్, సత్యనారాయణ రెడ్డి, సంజీవరెడ్డి, సదాల నరేందర్ రెడ్డి, చెన్నా రెడ్డి, రణధీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, మోహన్ రావు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

