నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 26,1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని, అందుకు ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని అంగీకరించిన రోజుగా జరుపుకుంటామని అదనపు ఎస్పి ఎండీ రియాజ్ హుల్ హక్ తెలిపారు.బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయంలో భారత రాజ్యాంగ పీఠిక ను పోలీస్ అధికారులు సిబ్బంది అందరు చదవడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ… 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారంకంగా ఆమోదించినందున ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది అప్పటినుంచి మనం గణతంత్ర దేశంగా మారం అని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా పిలుస్తామని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని ఇది ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభాత్రత్వం, వంటి హక్కులను అందిస్తుంది అని తెలిపారు. ఈరోజు మన హక్కులు బాధ్యతలు గుర్తు చేసుకోవాలని భారత రాజ్యాంగం ఇచ్చిన విలువలను కాపాడుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాధ్యత దానికనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, శివశంకర్, నరేష్, పురుషోత్తం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





