Wednesday, March 18, 2026

*రానుంది మళ్ళీ బీఆర్ఎస్ సర్కారే : కొప్పుల** గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం * గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు సన్మానం*

నేటి సాక్షి, ఎండపల్లి:* రానుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గెలిచిన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో గెలుపొందిన వారిని ఆయన అభినందించారు. మండల కేంద్రంలో సర్పంచ్ మారం సునీత-జలేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ దాసరి కళ్యాణి, శానబండ సర్పంచ్ గాదం భాస్కర్, ఉప సర్పంచ్ కడారి రజిత, పడకల్ సర్పంచ్ బెడ్డల ప్రవీణ్ మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ తీరును ప్రజలకు వివరించి, వాటి అమలుకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం సాగించాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ పాలనలో పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, నాడు ఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదన్నారు. నేడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ రెండేళ్లలో కచ్చితంగా బీఆర్ఎస్ సర్కారే తప్పక వస్తుందని గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింహాచలం జగన్, ఏఎంసి మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, ఉద్యమకారుడు పడిదం వెంకటేష్, వెంకటేష్, నాయకులు మారం జగన్మోహన్ రెడ్డి, మైలారం సతీష్, వనం రమణయ్య, మేకల రాజేశం, ఉప్పు రాజయ్య, తనుగుల జగతి, గౌరీ చిరంజీవి, అరికిల్ల మహేందర్, దేవి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News