నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్:ఆసిఫాబాద్ రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పని చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు పిలుపునిచ్చారు.మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసిఫాబాద్‌లో తొలిసారిగా జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయదలచిన ఆశావహులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో లేదా డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంచార్జి మంత్రి ఆదేశాల మేరకు, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని గెలుపు సాధించే అభ్యర్థులకు బీ–ఫారం కేటాయిస్తామని తెలిపారు.కావున ఇప్పటి నుంచే ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాధవేణి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డి. నిజాం, దుర్గం సోమయ్య, నాంపల్లి శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మారుతి పటేల్, విశ్వనాథ్, ఫైసల్, తారీఫ్, జావేద్, కార్తీక్, భీంరావు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

