నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 15 ~అన్నమయ్య జిల్లా :-: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల నుండి సేకరించిన సంతకాల పత్రాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అర్ కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, గోవిందప్ప శ్రీనివాసులు, విజయేందర్ రెడ్డి, భూమన అభినయ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఏకమై పార్టీ జండాలను ప్రదర్శిస్తూ తిరుపతి నుండి తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోతారని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, పార్టీ సీనియర్ నేత, పుంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసి వాటిని పూర్తిచేయాలనుకోవడం ఒక చరిత్రనని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం దానిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ విమానాల్లో తిరగడానికే సమయం సరిపోతుందని, ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరంగా నిర్మాణ పనులను పూర్తి చేయకుండా ప్రైవేట్‌పరం చేసి పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.~~~~~~~~~~~~~~~~~~





