Friday, March 13, 2026

రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న క్యాంపస్ ఎకో బజార్ జగిత్యాల టౌన్-

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……………జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో క్యాంపస్ ఎకో బజార్ అందరినీ ఆకట్టుకుంది సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నేషనల్ గ్రీన్ కోడ్ మరియు రామకృష్ణ కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణంలో ఈరోజు ఎకో బజార్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పర్యావరణానికి హాని కలవకుండా తయారుచేసిన వస్తువులను ప్రదర్శించడంతోపాటు వాటిని విక్రయించారు కార్యక్రమంలో చేతి అల్లికలతో తయారుచేసిన బ్యాగులు ఆర్గానిక్ కూరగాయలు ఆహార పదార్థాలు స్వదేశీ దీపావళి వస్తువులు మట్టితో తయారుచేసిన పాత్రలు తృణధాన్యాలతో తయారుచేసిన తిను బండారాలు పేపర్స్ తో తయారుచేసిన అందమైన పూల అలంకరణ వస్తువులు మరియు చెక్కతో తయారు చేసిన కీ చైన్లు మరియు నేమ్ ప్లేట్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి*ఆరోగ్యమే మహాభాగ్యము అనడానికి ప్రతి రూపమే మనము ప్రకృతిని కాపాడడం*ప్రకృతిని కాపాడమంటే మన వంతుగా వాటికి ఏమో చేయాల్సిన అవసరం లేదు కానీ వాటికి హాని కలిగించే ప్లాస్టిక్ ని వాడకుండా ఉంటూ ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే వినియోగించేలాగా విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించినట్లయితే అది రేపు రాబోయే రోజులలో వారి కుటుంబంలో కూడా ప్లాస్టిక్ రహిత కుటుంబం గా ముందుకు సాగుతారని ఈ ఎకో క్లబ్ లో నిర్వహించిన వివిధ రకాల స్టాల్స్ ని కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ గారు డైరెక్టర్ పల్లెల నరేష్ గారు మరియు ప్రిన్సిపల్ కొక్కుల రాజేందర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి స్టాల్ వద్ద విద్యార్థులు తయారు చేసిన వస్తువులతో పాటు వారు ఎలా తయారు చేశారు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగి తెలుసుకుని రాబోయే రోజులలో వీటిని వినియోగిస్తూ మీరు అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచిస్తూ ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలోని అన్ని కళాశాలలో చదువుతున్న డిగ్రీ విద్యార్థులతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ఎకో బజార్లో ఏర్పాటు చేసిన పర్యావరణ రహిత వస్తువుల ప్రదర్శనను చూసి ఆనందించారు అదేవిధంగా వారు కూడా రాబోయే రోజులలో ప్లాస్టిక్ రహిత సమాజానికై తమ వంతుగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ గారు స్టాల్స్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేసి వారి ప్రతిభను మెచ్చుకున్నారు అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమం జగిత్యాల జిల్లాలో మా రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థి దశలోనే వారికి విద్య నైపుణ్యాలే కాకుండా ప్రకృతిని పరిరక్షించే క్రమంలో సమాజ సేవలో వారు భాగస్వాములు అయ్యేవిధంగా అధ్యాపకులు విద్యార్థులకు ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా సమాజసేవలో భాగస్వామ్యుడు అయినప్పుడే తనతో పాటు తన కుటుంబానికి దేశానికి ఈ ప్రపంచానికి ఒక శక్తి లాగా ఎదుగుతారని ప్రతి విద్యార్థి కూడా పర్యావరణ రహిత ఉపయోగిస్తూ స్వచ్ఛమైన గాలి నీరును కలుషితం కాకుండా చూడాలని అలాగే మనము ఈ భూమిపై నివసిస్తున్న ఏ ప్రాణి కూడా ప్రకృతికి హాని కలిగించదు కానీ కేవలం మానవుడు మాత్రమే తన అవసరాల రీత్యా లేదా ఒక లగ్జరీ లైఫ్ జీవించడం కోసమో మనం ప్రకృతికి హాని కలిగించే వస్తువులను ఉపయోగిస్తున్నాము కానీ అందరూ ఆలోచించి రాబోయే రోజులలో ప్లాస్టిక్ ను మనం ఉపయోగిస్తే మన ముందు తరాలకు ప్రకృతి నుంచి అనేక వైపరీత్యాలు ఏర్పడి అనారోగ్య సమస్యలతో పాటు అనేక సమస్యలు వస్తాయని వాటన్నిటిని నిలదొక్కుకొని మన ముందుకు సాగాలంటే ఈ రోజు నుంచే మనం ప్లాస్టిక్ రైతు సమాజాన్ని సాధించడంలో ముందుండాలని అందులో మా విద్యాసంస్థలు ముందు ఉంటాయని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News