Friday, March 20, 2026

*రామాపురం డంపింగ్ యార్డులోని చెత్త నిర్వహణ త్వరగా పూర్తి చేయండి.**ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్. మౌర్య.*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*రామాపురం డంపింగ్ యార్డులోని చెత్త నిర్వహణ గడువులోపు త్వరగా పూర్తి చేయాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. రామాపురం వద్దనున్న లెగసీ వేస్ట్ డంపింగ్ యార్దును మంగళవారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు లెగసీ వేస్ట్ ను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులు కలసి త్వరగా చెత్త నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ లో అక్టోబర్ 2వ తేదీ నాటికి 2,21,000 మెట్రిక్ టన్నుల చెత్తను నిర్వహణ చేశారని తెలిపారు. రెండవ దశలో 65000 మెట్రిక్ టన్నుల చెత్త నిర్వహణను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువు లోపు చెత్త నిర్వహణ చేసేలా అధికారులు పరిశీలన చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ రమణ, చెత్త నిర్వహణ ప్లాంట్ నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News