నేటి సాక్షి, కోరుట్ల: ఈనాడు అధినేత రామోజీరావుకు కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పట్టణంలోని కార్గిల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఆయన సేవలను కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతీ పాత్రికేయుడు కంకణబద్దులు కావాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర శేఖర్ పిలుపునిచ్చారు.

