నేటి సాక్షి పాలేరు ,జూన్ 26 :
కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడైన అప్పగాని రామ్మూర్తికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు గురువారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా ట్రై స్కూటీని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు, మాజీ సర్పంచులు గుగ్గిల మోహన్, చాట్ల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.