నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- రాయచోటి ప్రజల ఆత్మఘోష ర్యాలీకి గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఈ నెల 31వ తేదీ బుధవారం నాడు శాంతియుత ప్రజా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నామని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.📍స్థలం రాయచోటి ఎస్.ఎన్. కాలనీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమని ఉదయం 9:00 గంటలకు ఆత్మఘోష ర్యాలీ ప్రారంభం కాబోతుందని సోమవారం ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించాలనే న్యాయమైన, ప్రజాస్వామ్య డిమాండ్‌తో నిర్వహించనున్న ఈ “అన్నమయ్య జిల్లా ప్రజల ఆత్మఘోష ర్యాలీ” నేడు చారిత్రాత్మక అవసరంగా మారిందని కూటమి ప్రభుత్వ వైఖరితో రాయచోటికి జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టాలంటే, ప్రజలంతా ఏకతాటిపై నిలబడి తమ గళాన్ని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగాలనే ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తపరుస్తూ, రాయచోటి ప్రజల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని కాపాడే దిశగా ఈ ర్యాలీ నిర్వహించనున్నామని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పల్లె నుంచి ప్రతి పౌరుడు పెద్ద ఎత్తున పాల్గొని, తమ ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శాంతియుత ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని, రాయచోటి హక్కుల కోసం, అన్నమయ్య జిల్లా గౌరవం కోసం తమ గళాన్ని వినిపించాలని మనవి చేస్తున్నట్టు గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు..~~~~~~~~~~~~~~~~~

