నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 15 ~అన్నమయ్య జిల్లా :-: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను సాగరంపుతారు. వాటిని ఈనెల 18న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనతో పాటు మరి కొందరు వైసీపీ ముఖ్య నేతలు కలిసి గవర్నర్ నజీర్ అహ్మద్ కు అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపేయాలని వైయస్ జగన్ గవర్నర్ ను కోరనున్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాలను సేకరించిన విషయం విదితమే. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం) లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ చర్య పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడమేనని వైసీపీ నేతలు మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, నిస్సార్ అహ్మద్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి నూతన కాల్వ అనిషారెడ్డి, వైసీపీ ముఖ్య నాయకుడు నూతన కాల్వ శ్రీనాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆముదాల మధుసూదన్ రెడ్డి లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 10న ప్రారంభమైన ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించినట్లు పార్టీ నేతలు తెలిపారు. మెడికల్ విద్య సామాన్యులకు దూరమవుతుందనే ఆందోళనతోనే ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ‘ప్రైవేటీకరణ’గా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే సంకల్పంతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో ఐదు కళాశాలలు పూర్తి కావొచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ఈ కళాశాలలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి, పేదలకు వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ‘ప్రైవేటీకరణ’గా అభివర్ణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని గత వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించాలనే సంకల్పంతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో ఐదు కళాశాలలు పూర్తి కావొచ్చాయని అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ఈ కళాశాలలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి, పేదలకు వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోందని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన లభించిందని, ప్రజల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ద్వారకానాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో సేకరించిన 3 లక్షలకు పైగా కోటి సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనంలో నింపి రాయచోటి పట్టణ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద నున్న శివాలయం నుంచి బంగ్లా వరకు వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించామని స్వచ్ఛంధంగా, వేలాదిగా యువత, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు, పెద్ద ఎత్తున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలొచ్చి సంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని 3 లక్షల పైగా కోటి సంతకాల పత్రాలను నింపిన వాహనానికి జెండా ఊపి రాయచోటి నుంచి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగిందని ఆయన తెలిపారు. మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం అన్నమయ్య జిల్లాలో మహోద్యమంగా మారిందన్నారు. చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదల వైద్యవిద్య హక్కును కాపాడాలన్న సంకల్పంతో సాగిన ఈ ఉద్యమం రాయచోటి పట్టణాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఆకేపాటి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రం నుంచి తాడేపల్లి వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల పత్రాల తరలింపు సందర్భంగా రాయచోటిలో నిర్వహించిన భారీ ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలివచ్చారని జిల్లాలో సేకరించిన 3 లక్షల సంతకాల పత్రాలతో నింపిన వాహనం రాయచోటి చెక్‌పోస్ట్ శివాలయం నుంచి బంగ్లా వరకు సాగిన ర్యాలీలో ప్రజాగ్రహం ప్రతిబింబించిందని ఆయన పేర్కొన్నారు.స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రజలు..—————————–యువత, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన గళం వినిపించారని ప్రజల హక్కైన వైద్యవిద్యను ప్రైవేటు బినామీలకు అప్పగించడాన్ని సహించబోమని ఆకేపాటి అమరనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్యవిద్య ఉండాలి..——————————మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందించాలని ప్రజలు డిమాండ్ చేశారని పీపీపీ మోడల్ పేరుతో ప్రజా వైద్యంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని కొరుముట్ల శ్రీనివాసులు నినదించారు.“వైద్యవిద్య అమ్మకానికి కాదు – ఇది ప్రజల హక్కు”,“పిపిపి మోడల్ రద్దు చేయాలి. ప్రజా వైద్యంపై కూటమి కుట్రలను తిప్పికొడదామంటూ అనీషా రెడ్డి అన్నారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతోనే వైసీపీ శ్రేణులు యువత నినాదాలతో హోరెత్తించారు..





