నేటి సాక్షి 07:— రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ లిఫ్టు పరిశీలనకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. రామాంజనేయులు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి. రామచంద్రయ్యలతో పాటు కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య,అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి తో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు హాజరవుతున్నారని ఈ పర్యటన విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు పిలుపునిచ్చారు.. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం లో అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సాగునిటీ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని అదేవిధంగా రాయలసీమ లిఫ్టు పూర్తిచేసి రాయలసీమ రైతాంగన్ని ఆదుకోవాలని కోరుతూ రేపు జరగబోయే పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు మక్బుల్ భాష, రాజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు..

