Saturday, March 14, 2026

*రాయల చెరువును పరిశీలించి..ముంపు గ్రామాల రైతులకు అండగా ఉంటా ఎమ్మెల్యే పులివర్తి నాని*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని మండల అధికారులు , నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి రాయల చెరువు ను పరిశీలించారు చెరువు లోకి నీరు వస్తున్న విధానాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే అన్నారు రాయలచెరువు ముంపు భూముల మ్యాప్ ను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ నేపథ్యంలో చిట్టతూరు కాలేపల్లి పంచాయతీలోని రైతులు తమ గోడును ఎమ్మెల్యే ముందు విన్నవించుకున్నారు పలువురు రైతులు ముంపు గ్రామాల పంటలు మునిగిపోయి నష్టాల్లో ఉన్నామని వాపోయారు పశువులకు గడ్డి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఎమ్మెల్యే స్పందించి ప్రతి రైతుకు ప్రతి సెంటు భూమికి నష్టపరిహారాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా పశుగ్రాసాన్ని వెంటనే అందిస్తామని వెంటనే వ్యవసాయ అధికారిని పశుసంవర్ధక అధికారులకు రైతులకు పశుగ్రాసం కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందనిఆదేశించారు ఈ నేపథ్యంలో రాయలచెరువు కట్టపై నుంచి అనుపల్లి వరకు రోడ్డు నిర్మాణం పనులను త్వరలో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయల చెరువు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కుప్పా త్యాగరాజులు , మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమలరెడ్డి , చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి చిన్నబాబు, నాయకులు జెడి జగన్,రావిళ్ళ గిరిబాబు ,ఆరి లీలా మోహన్,కొట్టే నరసింహారెడ్డి, పసుపులేటి విజయ కుమార్,కొట్టే గిరిధర్ రెడ్డి, కొట్టే ధనుంజయ రెడ్డి, ఆడి రాజారెడ్డి, డి హరిప్రసాద్, సి వి ప్రసాద్, లెక్కల సురేంద్ర నాయుడు, లెక్కల మహేష్ నాయుడు, కొడవటిగంటి జగదీష్, సుకుమార్ నాయుడు, రేకలచేను మోహన్ రెడ్డి, ధనుంజయ రాయలు,మల్లి రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి,రాజేష్ రెడ్డి, చెరుకూరి రవి, వెంకట కృష్ణారెడ్డి, పి శివశంకర్ రెడ్డి,తాసిల్దార్ మధుసూదన్ రావు,ఇరిగేషన్ ఎత్తి రాజులు, ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి మమత, ఏపీఎం గురుమూర్తి, ఏపీవో సుజాత, ఆర్ అండ్ బి ఏ ఈ ధనలక్ష్మీ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎఇ పవన్ రాజు,సెక్రటరీ శ్రీలేఖ, ఎస్సై భక్తవత్సలం వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News