నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ముంథాన్ తుపాను వల్ల రాయల చెరువుకు ఎటువంటి ప్రమాదం లేదని సురక్షితమైనని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు మంగళవారం ఆర్డీవో రామ్మోహన్ తో కలిసి రాయల చెరువులో నీటిమట్టాన్ని , గుర్రప్ప తూము, మిద్దె పైకి వెళ్ళి చెరువును పరిశీలించారు చెరువు గట్టు పై ఉన్న ముళ్ళపొదలును ఎన్ ఆర్ జి యస్ పనులు ద్వారా తొలగించాలని ఎపిఓ సుజాత ను ఆదేశించారు ముందుగా రామచంద్రపురం ఎస్టీ కాలనీలో తుఫానుకు పూరి గుడిసె పై విరిగిపడిన చెట్టు. పూరి గుడిసెలో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది. బాధితులను ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికారులు నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం ద్వారా పక్క గృహాన్ని మంజూరు చేయించాలని హౌసింగ్ ఏఈని ఆదేశించారు అనంతరం కాలేపల్లి చిత్తూరు గ్రామాలను సందర్శించారు ముంపు గ్రామాల రైతులతో ముఖాముఖి మాట్లాడారు చిట్టతూరు మహిళలు గత ఆరు నెలలుగా మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో చర్చించి రెండు రోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని మహిళలు హామీ ఇచ్చారు.పిల్లారి కోన చెరువును సందర్శించి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జల హారతి ఇచ్చారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాయలచెరువు నీటి సంఘం ఉపాధ్యక్షులు త్యాగరాజులు మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి సీనియర్ నాయకులు చిన్నబాబు, తానికొండ కేశవులు నాయుడు, కొట్టే నరసింహారెడ్డి, కొట్టే గిరిధర్ రెడ్డి ,కోరాహరి ప్రసాద్ , పసుపులేటి విజయ కుమార్, లెక్కల సురేంద్ర ,తానికొండ రెడ్డప్ప నాయుడు, కొల్లం గుంట ముని రామిరెడ్డి,కొట్టే ధనుంజయ రెడ్డి,డి హరిప్రసాద్ ,కోటేశ్వర్ రెడ్డి, చెరుకూరి రవి, కొడవటిగంటి జగదీష్, రమేష్ రాయలు, సాయి ప్రతాప్, కమలాకర్ రెడ్డి, విజయ కుమార్ రెడ్డి,ఎమ్మార్వో మధుసూదన్ రావు, ఇరిగేషన్ ఎఈ ఎత్తిరాజులు,ఇంచార్జి ఎంపిడిఓ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి మమత,ఎపియం గురుమూర్తి, ఎలక్ట్రికల్ ఎఇ గిరిధర్,ఎపిఓ సుజాత, తదితరులు పాల్గొన్నారు





