నేటి సాక్షి – రాయికల్*( రాధారపు నర్సయ్య )రాయికల్ మండలంలోని రామజీపేట వద్ద గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని పాఠశాల బస్సు ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.*మృతుడిది గుండంపల్లి*బస్సు ప్రమాదంలో మృతిచెందిన అతన్ని గుండంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి మధుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన ప్రభావంతో మధు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటనతో గుండంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది._____




