నేటిసాక్షి, రాయికల్ :
రాహుల్‌గాంధీ జన్మదిన సందర్భంగా రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బిజెపి ఇతర పార్టీలతో జట్టు కట్ట వలసి దుస్థితి వచ్చిందని అన్నారు.దేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వలు రక్షణ రంగంలో భారత్ ను ఓక అజేయశక్తి గా నిలిపాయన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించల్సిన కేంద్ర ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.నిరుద్యోగ సమస్యను గుర్తిచడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రజా పాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందస వాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసిన బడుగు బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆలోచన గలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరుపొందిరని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ,మండల అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకీర్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి,బత్తిని నాగరాజు,నాయకులు ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,వాసం దిలీప్,కొమ్ముల ఆదిరెడ్డి,కడకుంట్ల నరేష్,అశోక్,మోబిన్,మండ రమేష్, రాకేష్ నాయక్,తలారి రాజేష్,బాపురపు రాజీవ్,జక్కుల సాగర్,రాజేష్,నరసింహారెడ్డి,ఆనంద్,పాసం భూమయ్య,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాజశేఖర్, రాజేందర్,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో….
రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, నాయకులు గంగధర్, నరేష్, యూత్ మండల్ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని నాగరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి షాకీర్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు రాజీవ్,మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు సాగర్,శివ, శేఖర్, రాంకీ, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 19RKL02:రోగులకు పండ్లు పంపీణీ చేస్తున్న దృశ్యం
19RKL02A: గాంధీ చౌక్ వద్ద రాజీవ్గాంధీ జయంతి దృశ్యం

