Monday, April 6, 2026

రాష్ట్రంలో సంక్షేమం నిల్.. మద్యం ఫుల్..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి (భక్త కుమార్):కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరిచింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నది*
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదు
వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్

   రాష్ట్రంలో జగనన్నను కాదని చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల మాటలు నమ్మి కుటమి ప్రభుత్వానికి ఓటు వేసిన పాపానికి పాలు ఇచ్చే గేదెను వదిలి దున్నపోతును నమ్ముకొన్నం అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్  వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పాలన దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉంది ప్రజా సంక్షేమం మరిచారు.

భౌతిక దాడులు పెరిగాయి..
భూ ఆక్రమణలు పెరిగాయి..
ఇసుకను దోపిడి పెరింది..
మట్టిని దోపిడి పెరిగింది..
రాజకీయ వేధింపులు పెరిగాయి..
ప్రభుత్వ విద్య నీరుగారి పోయింది..
ప్రవేటు విద్యకు ప్రాధన్యత పెరిగింది..
ప్రభుత్వ వైద్యనికి చెదలు పట్టింది..
ప్రైవేటు వైద్యం చేయుంచుకోలేక ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు..
ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురుచూపులు..
మేఘ డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూపులు.. నిరుద్యోగ యువత 20 లక్షల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు..
నెలకు1500 వందల రూపాయలు వస్తాయని మహిళలు ఎదురుచూపులు..
నెలకు 3000 వేల రూపాయలు వస్తాదని నిరుద్యోగులు ఎదురుచూపులు..
ఉచిత సిలిండర్ పేరుతో కుచ్చుటోపి పెట్టారు…
మొత్తం మీద అవినీతి పెరిగింది..
సామాన్యుడికి ప్రభుత్వ అధికారులు పలకడం లేదు..
ప్రభుత్వం సంక్షేమం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు..
ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇంటి స్థలం కోసం ఎదురుచూపులు..
ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూపులు..
డెవలప్మెంట్ లేక పూర్తిగా రోడ్లన్నీ గుంతల మయం..
రియల్ వ్యాపారం పడిపోయినది..
అన్నీ రకాల వ్యాపారాలు తగ్గిపోయాయి…
రాయలసీమ వ్యాప్తంగా కరువు చాయలు అలుముకున్నాయి..
ప్రజలు పనులు దొరకక పస్తులు ఉండే కాలం వచ్చినది…
రైతులు పెట్టుబడి నిధి 20,000 వేల రూపాయలు ఇవ్వడం లేదు..
మత్స్యకారులు 20 వేల రూపాయల కోసం ఎదురుచూస్తున్నారు.. నేతన్నకు ఏడాదికి 24 వేల రూపాయల కోసం ఎదురుచూస్తున్నాడు. నాయి బ్రాహ్మణులు రజకులు తోపుడు బండ్లవాళ్లు చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. .
రైతులు అరకోర పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే వదిలేసే పరిస్థితి..
రైతుల దగ్గర పెట్టుబడి లేక అరకొర పంట కూడా పండించడం లేదు..
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
రైతులు సైతం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి వచ్చింది..
ప్రభుత్వ ఉద్యోగి పరపతి పడిపోయినది…
ప్రైవేట్ ఉద్యోగి పరపతి తగ్గింది.
సామాన్యుడి పరపతి అడ్రెస్ లేకుండా పోయింది..
అమ్మ ఒడి కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు..
కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు..
బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో వెలిసాయి.నేడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది.బెల్టు షాపులతో మద్యాన్ని కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, దారుణాలు జరుగుతున్నాయి.
పట్టణాలలో గంజాయి అమ్మకం విపరీతంగా పెరిగినది…
నిత్యవసర సరుకులు రెంట్లు పెరిగాయి..
కరెంట్ ఛార్జీలు పెరిగాయి…
ఆదాయాలు లేకుండా పోయాయి..
పట్టణాల్లో పారిశుధ్యం లేక మళ్ళీ చెత్త కుప్పల దగ్గరికి చేరింది..
రీసర్వే..రైతుల్ని ముప్పతిప్పలు పెడుతోంది.. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజాల్లో తిరిగి పరిస్థితి లేదు..
ఆంధ్ర అప్పుల్లో చంద్రబాబు రికార్డు…సంపద సృష్టిపై ప్రగల్భాలు పలికిన చంద్రబాబు
12 నెలల్లోనే లక్ష కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది ప్రజలనెత్తిన అప్పులు పెట్టి రాజధాని పేరుతో వేల కోట్లు దండుకోవడానికి సిద్ధమైనది కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రశ్నించే గొంతులను జైలు పాలు చేయడం స్కాముల పేరు చెప్పి నాయకులను జైలుపాలు చేస్తున్నది కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనకు పరాకాష్టంగా మారినది ఈరోజు ఎలక్షన్ వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని కూకటివేర్లతో పెరికేయడానికి ప్రజలు సంసిద్ధమైనరు అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ ప్రశ్నించారు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News