Monday, March 16, 2026

రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమం ఉధృతం మహబూబాబాద్‌లో బి.సి – ఎస్.సి – ఎస్.టి జె.ఏ.సి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు – 9వ షెడ్యూల్‌లో బిల్లు చేర్పు డిమాండ్

నేటిసాక్షి మహబూబాబాద్, నరసింహుల పేట (బి. ఆర్. నాయక్) నవంబర్ 4: మహబూబాబా ద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబాబాద్ జిల్లాలో బి.సి – ఎస్.సి – ఎస్.టి జె.ఏ.సి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ సమర్పించారు.ఈ రిప్రజెంటేషన్‌లో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం బి.సి రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్‌లో చేర్పు చేయాలని, అలాగే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని కోరారు.జిల్లా కోఆర్డినేటర్ రాంపాక సుధాకర్ మాట్లాడుతూ,“42 శాతం బి.సి రిజర్వేషన్ సాధన సమితి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చే బాధ్యతను తీసుకోవాలి,” అని తెలిపారు.ప్రధాన డిమాండ్స్:1️⃣ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2025లో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బి.సి రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లును కేంద్రం వద్ద 9వ షెడ్యూల్‌లో చేర్పు కోసం వేగవంతం చేయాలి.2️⃣ రాబోయే శీతాకాల పార్లమెంట్ సెషన్‌లో ఈ బిల్లును చేర్చేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి.3️⃣ 42 శాతం రిజర్వేషన్‌లో సబ్ క్యాటగిరేషన్ (ఉపవర్గీకరణ) చేసి, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి.4️⃣ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం ₹20,000 కోట్ల బి.సి సబ్ ప్లాన్ అమలు చేయాలని, ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తాన్ని పెంచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ₹40,000 కోట్లు ఖర్చు చేయాలి.5️⃣ రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, కమిషన్లు, బోర్డులు, సలహా మండళ్లలో 90 శాతం ప్రాతినిధ్యం బి.సి, ఎస్.సి, ఎస్.టి లకు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దాసరి లక్ష్మినివాస్ (మహబూబాబాద్ మండల భాద్యులు), మంగళపెల్లి రాజకుమార్ (ఎం.జె.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు), రాయల రమేష్ (ఎం.జె.ఎస్ సీనియర్ నాయకులు), పెండ్యాల బాబు, డోనక ఐలయ్య డి.ఎస్.పి (తొర్రూర్ మండల అధ్యక్షులు), కొమ్ము ఎల్లయ్య డి.ఎస్.పి (నరసింహులపేట మండల అధ్యక్షులు), తనికేటి రాజా, రేపల్లి నరేష్ కుమార్ రజక, దొంతు పురుషోత్తం (పద్మశాలి జిల్లా యువజన అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు.చివరగా కార్యకర్తలు గట్టిగా నినదించారు –“జై పూలే..! జై భీమ్..! జై బి.సి రిజర్వేషన్..!” 🙏

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News