నేటి సాక్షి ఉప్పల్ అక్టోబర్ 17 బీసీ వర్గాల హక్కుల సాధన కోసం రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు బి ఆర్ ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ప్రజలు బంద్ ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్త బంద్ ఒక శాంతియుత నిరసన రూపమని బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.బీసీల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగుతుందని, సమాజ అభివృద్ధి కోసం ఇది ఒక ఆవశ్యక దశ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని బీసీ సమాజ ఐక్యతనుచాటాలని ఆయన అభిప్రాయపడ్డారుబీసీల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.




