Saturday, March 21, 2026

*రాష్ట్రస్థాయి అబాకస్ పోటీలకు శ్రీ భార్గవి విద్యార్థి షేక్ షోయబ్ ఎంపిక* * ఎంపికైన విద్యార్థి షేక్ షోయబ్ కు తల్లిదండ్రులు కు అభినందనలు * అభినందించి శాలువతో సత్కరించిన పాఠశాల యాజమాన్యం

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్లపాలెం) ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన జోనల్ స్థాయి అబాకస్ కాంపిటీషన్లో శ్రీ భార్గవి హై స్కూల్ కు చెందిన రెండో తరగతి విద్యార్థి షేక్ షోయబ్ స్టార్ జూనియర్ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం షోయబ్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. షోయబ్ ను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులు షబ్బీర్ యాస్మిన్ సుల్తానాను పాఠశాల యాజమాన్యం దృశ్యాల వాళ్ళతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా షోయబ్ ను ఉత్తమ ప్రతిభను కనబరిచే విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలు మార్పు బేబీని కూడా ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల నుండి పోటీలలో పాల్గొన్న మరో పదకొండమంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీని కరస్పాండెంట్ మాట్లాడుతూ జనవరిలో జరిగే అబాక రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు దివ్య,సాహితి, సత్యవతి, లక్ష్మీ ప్రసన్న రిజ్వానా, ప్రేమావతి, నవీన్, చక్రవర్తి, సునీత, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News