నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 27
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ తెలంగాణ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కె. చరణ్ నాయక్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడని గురుకుల ప్రిన్సిపల్ ఎం.రాజారామ్ కోచ్ డా. రామ్మోహన్ గౌడ్
పీఈటి ఆంజనేయులు, పీడీ తేజ గురువారం తెలిపారు. ఈనెల 28వ తేదీ నుండి జూలై 1 వరకు తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ సౌజన్యంతో నిజామాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారం క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 20 నుండి 26
వ తేదీ వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో జిల్లా క్రీడా మైదానంలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువుల్లోనూ, ఆటల్లోనూ రాణించాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజారాం అభిలాషించారు. ఈ సందర్భంగా విద్యార్థి చరన్ ను అభినందించారు. విద్యార్థి ఎంపిక పట్ల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సాంబయ్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు.