Monday, March 16, 2026

*రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ప్రొడిజీ విద్యార్థి ఎంపిక* * ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో బంగారు పతకం కైవసం చేసుకున్న నక్కల కౌషిక్* బంగారు పతకం కైవసం చేసుకున్న నక్కల కౌషిక్ విద్యార్థికి అభినందనలు * అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు

నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి క్రమశిక్షణతో ఉంటూ ఉత్తమ శిక్షణ తీసుకొని ఉమ్మడి జిల్లాస్థాయి యోగా పోటీలలో విశిష్ఠ ప్రతిభ కనబరిచి నక్కల కౌషిక్ బంగారు పతకం సాధించి ప్రొడిజీ విద్యాలయ కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చాడని ప్రిన్సిపల్ బ్రజేష్ కానూన్గో అన్నారు. రావెల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల నాల్గవ తేదీన జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 14 విభాగమ్ యోగా పోటీలలో నక్కల కౌషిక్ పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారన్నారు నక్కల కౌషిక్ కు బంగారు పతకాన్ని మెమొంటో ను యోగా గురూజీ స్వాత్మ రామస్వామి,మల్లిఖార్జున్ గురూజీ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస రెడ్డిలు అందచేసి అభినందించారు కౌషిక్ ను ప్రొడిజి విద్యాలయ ప్రాంగణం లో శుక్రవారం అభినందన సభ ఏర్పాటు చేసి ప్రిన్సిపల్ బ్రజేష్ కానూంగో డైరెక్టర్లు మాచబత్తిని శ్రీనివాస రావు ,చింతకాయల పార్థసారథి,పెదమల్లు ఉదయ చంద్ర రావు,ఉపాధ్యాయులు అభినందించారు నక్కల కౌషిక్ ను బంగారు పతకం మెడల్ తో సత్కరిస్తున్న గురూజీలు స్వాత్మ రామస్వామి మల్లిఖార్జున్ గురూజీలు పిడి శ్రీనివాస రెడ్డిలు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News