నేటి సాక్షి- మేడిపెల్లి (దుమాల అనీల్): భీమారం మండలం గోవిందారం ఉన్నత పాఠశాల కి చెందిన పిట్టల నవదీప్, పొన్నం రిశ్వంత్, గంగానవేణి సంతోష్, కొప్పుల రామ్ చరణ్. చెల్ల నగేష్. జిల్లా స్థాయి ఎంపికలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి కి ఎంపికైనట్లు సాఫ్ట్ బాల్ జగిత్యాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్ను వెంకటేష్ ప్రకటించారు విద్యార్థులఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అస్ఫాక్ హుస్సేన్. ఉపాధ్యాయ బృందం సంతోషాన్ని వ్యక్తం చేసారు ఎంపికైన విద్యార్థులు మెదక్ జిల్లా లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నారు అని పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడు ప్రశాంత్. తెలియచేసారు.