నేటి సాక్షి 30 మార్చి నంద్యాల:-రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి, మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి. గనియ, చేతుల మీదుగా సత్కారం పొందిన వేంపెంట మాజీ సర్పంచ్. టేకూరి.రామసుబ్బమ్మ అంతేకాకుండా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సింగపూర్ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి. నాగేశ్వరరావు స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమంలో భాగంగా P4 కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం నుండి *పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన డా.టేకూరి నాగేశ్వరావు గారుచేసిన సేవలకు గుర్తింపుగా ఆయన వృద్ధ దంపతులైన పేదలకు ఒక గృహాన్ని నిర్మించి ఇవ్వడం ఒక గొప్ప కార్యక్రమం.ఈ మంచి పనిని గుర్తించి డా.సింగపూర్ టేకూరి నాగేశ్వరావు వారికి బదులుగా ఆయన తల్లి గారి అయినటువంటి ,టేకూరి రామసుబ్బమ్మ ఈ సత్కారం పొందడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడుతూ నాగేశ్వరావు లాంటి గొప్ప కొడుకుకు జన్మని ఇచ్చినందుకు నీ జన్మ ధన్యం అయిందని,టేకూరి నాగేశ్వరావు నాకు బాగా తెలుసని,ఆయనది గొప్ప వ్యక్తిత్వం అని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని పయ్యావుల కేశవ్ గారు సభాముఖంగా తెలిపారు.మైనార్టీ మంత్రివర్యులు నిరంతరం ప్రజల కోసం పాటు పడే సింగపూర్ నాగేశ్వరావు గారు ఎక్కడో సింగపూర్ నుండి కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుగుదల కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో మన అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచారని ఎన్.యం.డి.ఫరూక్ వారు తెలిపారు.కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సింగపూర్ నాగేశ్వరావు గారి గురించి నేను చాలా తెలుసుకున్నాను.నేను వేంపెంట పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు తన సొంత నిధులు వెచ్చించి వేంపెంట గ్రామంలో ఆ డయేరియా సమయంలో గ్రామస్థులకు అండగా నిలబడం జరిగినదని,అది ఒకటే కాకుండా వికలాంగులకు దుస్తుల పంపిణీ,చనిపోయిన పేద కుటుంబాలకు సందర్శించి ఆర్థిక సహాయం అందించడం,తల్లితండ్రులు లేని పిల్లలకు చదువుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం,ఇలాగ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన గురించి చెప్పడం జరిగింది అని తెలిపారు.ఇలాంటి సేవలు మరింత ముందుకు తీసుకువెళ్తామని మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ సభాముఖంగా తెలిపారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ద్వారా ఇంకా ఎన్నో ఎన్నెన్నో చేయాలని మీకు దేవుడు దీవెనలు ఆశీస్సులు ఇప్పుడు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రముకులు కోరడమైనది.





