**నేటి సాక్షి తిరుపతి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ను మంగళవారం ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ అంబేద్కర్ స్టార్ కృష్ణ, ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, జనరల్ సెక్రెటరీ ఏ.వి.రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఇప్పటికీ సమాజంలో ఎస్సీ లపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడానికి మరింత కఠినతరమైన చట్టాలు తీసుకొనివచ్చి, ఖచ్చితంగా అమలు జరిగేటట్లు చూడాలని కోరారు. ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, జనరల్ సెక్రెటరీ ఏ.వి.రాజు మాట్లాడుతూ ఆర్టీసీ ఎస్సీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఒక సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరగా అందుకు చైర్మన్ జవహర్ గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా త్వరలో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.వి.రావు, అడిషనల్ జెనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ రావు, సీనియర్ నాయకుడు శాంసన్, ట్రెజరర్ కోటయ్య,ప్రచార కార్యదర్శి అనిల్,తిరుపతి జిల్లా నాయకులు అంజప్పా, వాసు , పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కడప ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి.చంద్రశేఖర్ ని కూడా శాలువాతో సత్కరించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు

