Friday, March 20, 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య..సంతకాల సేకరణకు కేవలం వైసీపీ వాళ్లే కాకుండా ఇతర పార్టీ వాళ్లు స్వచ్ఛందంగా రావడం హర్షనీయం.. సోమిరెడ్డి, శివ శంకర్ రెడ్డి

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మట్లివారిపల్లి గ్రామ సర్పంచ్ సోమిరెడ్డి, ఆర్ బి కే మాజీ చైర్మన్ శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి మాధవరెడ్డి పర్యవేక్షణలో బుధవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామంలోని ప్రతి గడపగడపకు వెళ్లి సంతకాల సేకరణ చేపడుతూ అలాగే పొలాల్లో పనిచేస్తున్న కూలీలను మమేకమవుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో పేద ప్రజల కోసం చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని, పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని ఉదాత్త లక్ష్యాన్ని చేపడితే అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బతీయడం సరైంది కాదని పేర్కొన్నారు. సంతకాల సేకరణలో కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా సాధారణ పౌరులు, ఇతర పార్టీల సానుభూతిపరులు పార్టీలకతీతంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు పలకడం హర్షనీయమని వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని చూసి చంద్రబాబు కళ్ళు తెరవాలని ప్రభుత్వ వైద్య రంగాన్ని దెబ్బతీసే నిర్ణయాన్ని మార్చుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News