Sunday, March 15, 2026

*రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ ఫుట్‌బాల్ పోటీలకు ధర్మారం విద్యార్థిని తేజస్విని ఎంపిక*..

నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 2) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్. తేజస్విని 69వ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమారు తెలిపారు. ఈ నెల 1న గోదావరిఖనిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ఈ నెల 3 నుండి 5 వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. తేజస్వినిని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకనీ కొమరయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News