నేటి సాక్షి, నారాయణపేట,నవంబర్ 17,వచ్చే నెల డిసెంబర్ లో భద్రాచలం లో జరిగే అండర్ 14 ఉమ్మడి జిల్లా కెప్టెన్ గా మక్తల్ శ్రీ గీతం పాఠశాల విద్యార్థి గౌతమ్ చంద్ర ను ఎంపిక చేయడం జరిగింది ఇట్టి సందర్బంగా పెద్దలు సన్మానం చేస్తూ వెనుక బడిన పాలమూరు జిల్లా మక్తల్ ప్రాంతం నుండి గత కొన్ని నెలలు గా క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్న గౌతమ్ ను ఉమ్మడి జిల్లా కెప్టెన్ గా నియమించడం సంతోషకరమని భవిష్యత్ లో ఈ విద్యార్థి అనేక అంచలుగా ఎదిగి తాను చదువుతున్న పాఠశాల కు మరియు ఈ ప్రాంతం కు మరింత పేరు తీసుకురావాలని ఆశా భావం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు శ్రీనివాస్ గుప్త డైసో వెంకటేష్ , తెలంగాణ స్పోర్ట్స్ అతారిటి కోశాధికారి లక్ష్మి నారాయణ గారు, ప్రైవేట్ పాఠశాల ల జనరల్ సెక్రటరీ అంజిరెడ్డి , గౌరవ ట్రస్మా సభ్యులు శ్రీ రమేష్ రావ్ ,శ్రీ సత్యనారాయణ గౌడ్, గీతం పాఠశాల పోషక కమిటీ అధ్యక్షులు మణికంఠ మరియు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి భాగ్య లక్ష్మి పాల్గొన్నారు.





