నేటి సాక్షి వికారాబాద్:సైబర్ నేరాల నియంత్రణలో బాధితులకు సత్వర న్యాయం అందించడంలో విశేష ప్రతిభ కనబరిచిన మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ (కానిస్టేబుల్) ఎం.డి. జావిద్ పాషా కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ అడిషనల్ డీజీ శ్రీమతి షికా గోయల్, గార్ల చేతుల మీదుగా జావిద్ పాషా ప్రశంసా పత్రం నగదు బహుమతిని అందుకున్నారు.సైబర్ మోసాలకు గురైన బాధితుల నగదును రికవరీ చేయడంలో కేసుల ఛేదనలో పోలీస్ అధికారులకు సమన్వయం తో, ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, చురుగ్గా వ్యవహరించిన జావిద్ పాషా ను వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసుల కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం పట్ల ఎస్పీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇదే స్ఫూర్తితో సైబర్ నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

