నేటి సాక్షి,నారాయణపేట, ఫిబ్రవరి,11, (రిపోర్టర్ ఇమామ్ సాబ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని రాకుండ గ్రామంలో ప్రభుత్వ చౌక ధార దుకాణాన్ని కేటాయించాలని బిఎస్పి పార్టీ నారాయణపేట జిల్లా నాయకులు చెన్నయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నాడు మరికల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 20 సంవత్సరాలుగా దళితులకే రేషన్ దుకాణం కేటాయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం దళితులకే కేటాయించాలని ఆయన కోరారు. ప్రభుత్వ రేషన్ దుకాణంను దళితుల కేటాయించాలని పేట జిల్లా కలెక్టర్ ను వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు

