Friday, March 13, 2026

రిజర్వేషన్లపై నిరసన చేస్తే…అరెస్ట్ చేస్తారా…?-సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

నేటిసాక్షి, మిర్యాలగూడ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం సిపిఎం ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసేందుకు సిపిఎం బృందం ముందుగానే అపార్ట్మెంట్ కోరినప్పటికీ, అపార్ట్మెంట్ ఇచ్చి, చివరి నిమిషంలో రద్దు చేసుకోగా దానిని నిరసిస్తూ, శుక్రవారం రాజభవన్ ముందు ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులను అక్రమ అరెస్ట్ చేయడం పట్ల ఖండిస్తూ, పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రిజర్వేషన్ విషయంపై గవర్నకు మెమోరండం ఇచ్చేందుకు అపార్ట్మెంట్ కోరగా, ఇవ్వకుండా గవర్నర్ నిరంకుశంగా వ్యవహరించారని ఆరోపించారు. శాంతియుతంగా రాజ్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న సిపిఎం నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ సమస్యలు చెప్పుకునేందుకు గవర్నర్ అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరును ప్రజలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు అరుణ, ఊర్మిళ, పిల్లుట్ల సైదులు, గాయం వీరారెడ్డి, కోట్ల శ్రీనివాస్ రెడ్డి, గోవింద్ రెడ్డి, సూర్యం, రామకృష్ణ, చౌగాని వెంకన్న, వెంకటయ్య, శ్రీనివాస్, ఉన్నం వెంకటేశ్వర్లు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News